- నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి రాక
రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ ప్రారంభం
ఏర్పాట్లపై ఎస్ఈఎస్ సమీక్ష
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ ప్రథమ పౌరురాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్న ఆమె ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు.అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్రు ప్రారంభిస్తారు.కాగా రాష్ట్రపతి పర్యటన నిర్వహించాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం వివిధ శాఖలకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. విమానాశ్రయం,రాష్ట్రపతి నిలయం,అన్ని వేదికల వద్ద అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి.
ముఖ్యంగా రాష్ట్రపతి అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని సీఐ.. ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రపతి కాన్వాయ్ ఉపయోగించాల్సిన రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో చేపట్టాలని ఆర్అండ్ బి శాఖకు ఉంచారు.రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచారు. అలాగే రాష్ట్రపతి జిల్లా పరిసర ప్రాంతాలలో కోతుల బెడద, తేనెటీగలు వాటి నివారణకు ప్రత్యేకలను జీహెచ్సి సమన్వయంతో ఏర్పాటు చేయాలని కోరింది. నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నారు.