- గత ప్రభుత్వంలోనే కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి
- టెండర్లు లేకుండానే సర్కారు హాస్టళ్లకు పాలు సరఫరా
- మాజీ మంత్రి కుటుంబీకులదే కాంట్రాక్ట్
- పూర్తి విచారణకు సీఎం ఆదేశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ డెయిరీలో నష్టాలపై సర్కారు ఫోకస్ పెట్టింది. మొన్నటిదాకా నిధుల కొరత కూడా డెయిరీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇతర ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయి. అయితే, గత ప్రభుత్వం చేసిన తప్పులతో డెయిరీకి నష్టాలు వస్తున్నట్లు రేవంత్ సర్కారు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బాటలో నడిచి.. ప్రభుత్వానికి లాభాల అయిదేళ్లపాటు డివిడెండ్ కూడా అందించిన విజయ డెయిరీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లడంపై నిజాలు బయటకు తీసేందుకు విచారణ చేపట్టింది. గత ప్రభుత్వం లేకుండానే ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్పిటళ్లకు పాల సదుపాయం అందించినట్లు కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే పూర్తి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మాజీ మంత్రికే పాల సరఫరా..?
విజయ డెయిరీ నష్టాలకు కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే, టెండర్లు లేకుండా ప్రభుత్వ వసతి గృహాలకు పాలను అందించారు, ఈ పాల సరఫరా కాంట్రాక్టును హరీష్ రావు కుటుంబీకులకు అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. సదరు మంత్రి కుటుంబానికి పాల సరఫరా బాధ్యతలను అప్పగించి.. పాలుపోసే రైతులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తున్నది. విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు గత ప్రభుత్వం ఎంత మేర బిల్లులు బకాయిలు పెట్టిందనే వివరాలను బయటకు తీస్తున్నారు. ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి రైతులను ఏ విధంగా మోసం చేసింది..? మొత్తం అప్పుడున్న బకాయిలు ఎంత.. నష్టాలెంత..? పూర్తి వివరాలతో నివేదిక అందించిన సీఎం రేవంత్రెడ్డి.. సంబంధిత అధికారుల సూచన మేరకు సమాచారం.
గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీష్ రావు తన కుటుంబీకులతో ప్రైవేటు డెయిరీ జరిగింది. అప్పట్లో గవర్నమెంట్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్పిటళ్లకు టెండర్లు కూడా లేకుండా పాలను అందించినట్లు ఫిర్యాదులున్నాయి. ఈ ఫిర్యాదులన్నీ సీఎం దృష్టికి వచ్చాయి. మాజీ మంత్రి హరీష్రావు, ఆయన కుటుంబీకుల పేరుతో డెయిరీ ఉన్న డాక్టర్ హరీష్ రావు గత ఎన్నికల అఫిడవిట్లోనూ ప్రస్తావించారు. అంటే పథకం ప్రకారం బీఆర్ఎస్ లీడర్లు గత ప్రభుత్వ హయాంలోనే విజయ డెయిరీని దెబ్బ తీసే ప్రయత్నం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, విజయ డెయిరీ నష్టాలు, అందుకు దారి తీసిన కారణాలు.. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. లక్షలాది మంది పాడి రైతులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది ఎవరు..? సమగ్రంగా విచారణ జరిపించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.
అమ్ముడుపోని ఉత్పత్తులు
మరోవైపు విజయ డెయిరీ అమ్మకాలపైనా సీఎం ఫోకస్ పెట్టారు. ప్రధానంగా సంస్థలో నిధులు నిండుకోవడం, పాలనపరమైన సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రతిరోజు సుమారు లక్షన్నర మంది రైతుల నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజు కోట్ల రైతులకు కనీసం రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి. ఆది నుంచి ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించే విధానం ఉండేది. ఇప్పుడు నిధుల లభ్యత ఆధారంగా ఇస్తున్నారు. ప్రస్తుతం రెండు నెలలకు సంబంధించి రూ.120 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు, పాలు సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్కు రూ.4 చొప్పున 2014లో ప్రకటించింది. కానీ, గత మూడేళ్లుగా దీన్ని చెల్లించడం లేదు.
ఆ బకాయిలు రూ.100 కోట్లకు పైనే ఉన్నాయి. ఈ విజయ పెరుగు డెయిరీ నెయ్యి, పాల పొడి, వెన్న, మజ్జిగ, దూద్ పేడ, లస్సీ, ఐస్క్రీమ్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తోంది. ఆరు నెలలుగా వీటి విక్రయాలు మందగించాయి. నిల్వలు పేరుకుపోయి వృథా అవుతున్నాయి. కొంత పరిమాణంలో నెయ్యి, ఇతర వస్తువులను ముంబయిలోని కొన్ని సంస్థలకు విక్రయిస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని దేవాలయాలు ఇతర ప్రాంతాల నుంచి, ప్రైవేటు డెయిరీల నుంచి ఉత్పత్తులు కొంటున్నాయి. విజయ నెయ్యినే కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డెయిరీ దేవాలయ అధికారులు నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విజయ డెయిరీ ఎండీ సైతం అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. అయినా గతం నుంచే ఆశించిన స్పందన లేదు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం విజయ డెయిరీ పాలు సరఫరా అవుతున్నాయి.
మెగా డెయిరీ ఏమైంది..?
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో గత ఏడాది రూ.246 కోట్లతో విజయ డెయిరీ ఆధ్వర్యంలో మెగా డెయిరీ నిర్మించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.74 కోట్లు, విజయ డెయిరీ రూ.26 కోట్లు వెచ్చించాయి. జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ నుంచి రుణంగా మిగిలింది. రోజుకు అయిదు లక్షల లీటర్ల పాల శుద్ధి, 9 టన్నుల నెయ్యితో పాటు ఇతర ఉత్పత్తుల తయారీకి భారీ సామర్థ్యంతో డెయిరీని నిర్మించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. మెగా డెయిరీ నిర్మాణానికి తీసుకున్న రుణానికి గాను సంవత్సరానికి రూ.31.99 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. అయితే, మెగా డెయిరీపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.