Home తెలంగాణ సింగరేణి కార్మికులకు బోనస్…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

సింగరేణి కార్మికులకు బోనస్…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
సింగరేణి కార్మికులకు బోనస్.... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండగ
  • కార్మిక కుటుంబాలకు అందనున్న రూ.796 కోట్లు
  • ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు
  • తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రూ.5 వేలు అందజేత
  • ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :- సింగరేణి కార్మికులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోన‌స్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాల ఆధారంగా బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు వెల్ల‌డించారు. ఒక్కో కార్మికునికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేలు చొప్పున బోనస్ ప్రక‌టించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్ర‌క్రియ‌లో సింగ‌రేణి కార్మికులు అగ్ర‌భాగాన నిలిచార‌ని, ఉద్యమాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ల‌డంతో గ‌ని కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిద‌ని కొనియాడారు. అనంత‌రం సింగ‌రేణి లాభాలు, విస్త‌ర‌ణ‌.. బోన‌స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క విలేక‌రుల‌కు వివ‌రించారు.

రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్న సింగ‌రేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా చేయ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోంద‌న్నారు. సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తం రూ.4,701 కోట్ల ఆదాయం స‌మ‌కూరి ఉంది. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించ‌గా మిగిలిన‌వి రూ.2,412 కోట్లు అన్నారు. ఇందులో మూడో వంతు రూ.796 కోట్లను కార్మికులకు బోనస్‌గా ప్రకటిస్తున్నామన్నారు. సింగ‌రేణిలో మొత్తం 41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఒకొక్కరికి బోనస్ కింద రూ.1.90 లక్షలను అందించనున్నామన్నారు. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 లక్ష‌లు మాత్ర‌మేనని, ఈ ఏడాది ఒక్క‌రికి అద‌నంగా అందుతున్న మొత్తం రూ.20 వేలు. ఇస్తున్నామని వివరించారు.

కాంట్రాక్ట్ కార్మికులకూ….

సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ తొలిసారిగా రూ.5 వేల బోనస్‌ను అందజేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ద‌స‌ పండ‌గ‌కు ముందే ఈ ఉంటుంద‌ని వారికి అంద‌జేయనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

విస్త‌ర‌ణే ల‌క్ష్యంగా…

సింగ‌రేణి సంస్థ ఆర్జించిన లాభాల‌ను భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. దాని ప్ర‌కారం.. ** సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1000 మెగావాట్లకు విస్త‌రించండి, రామ‌గుండంలో 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, జైపూర్‌లోని ప్ర‌స్తుత థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్ర మ‌రోత్తి రామ‌థ‌వ కేంద్రం ప్రారంభ టీఎస్ జెన్ కో ఆధ్వర్యంలో మరో 1×800 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిసిన సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. సంస్థ పరిధి వీకే ఓపెన్ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీల‌ను ప్రారంభిస్తామ‌ని, సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూత‌న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో, ఏరియా ఆసుప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌తో హైద‌రాబాద్‌లోని మ‌న‌ద‌రాబాద్‌లో మ‌న‌ర‌స‌ప‌రి చ‌ల‌సి ప‌థ‌కం. ఈ స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సీత‌క్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండ సురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ సంఘం రాష్ట్ర‌ప‌ది ఎంపీ సురేశ్ షెట్కార్, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, మక్క‌న్ సింగ్ రాజ్ ఠాకూర్‌, ప్రేమ్‌సాగ‌ర్‌రావు, సింగ‌రేణి ఎండీ బ‌ల‌రాం, కార్మిక సంఘ‌ల నాయకులు వాసిరెడ్డి సీతారామ‌య్య‌, జ‌న‌క్ ప్రసాద్‌ త‌దిత‌రులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech