18
రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న మొదటి విడతలో కూటమి ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది.