- జమిలి ఎన్నికలతో డబ్బు, సమయం ఆదా అవుతాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశ అభివృద్ధి కోసమే జమిలి ఎన్నికలను బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల వలన డబ్బు, సమయం ఆదా అవుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర మీడియాతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. దేశంలో నిత్యం ఏదో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశాభివృద్ధికి కొంతమేర ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. దేశ అభ్యున్నతి కోసం మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కొందమందికి నచ్చక పోవచ్చు , అయిదే జమిలి ఎన్నికల వలన దేశానికి మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికలకు కొంత సమయం పడటానికి.
పార్లమెంట్ లో జమిలి బిల్లు ప్రవేశ పెట్టి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తారని అన్నారు. ఆ సమయంలో ప్రతిపక్షాలకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చర్చలు వారి అభిప్రాయాలను చెప్పడానికి ఆయన చెప్పారు. దేశంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా మోడీ వంద పాలన పూర్తి చేసుకున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ను నిలబెట్టే లక్ష్యంతో మోడీ సర్కార్ పనిచేస్తోందని అన్నారు. మ్యాన్ ఫ్యాక్చర్ హబ్ గా ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎకో సిష్టం అభివృద్ధి అన్నారు. కార్మిక, కర్షక, శ్రామికులను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 75 ఏళ్ళు పైబడి ఆరు కోట్ల మందికి హెల్త్ కార్డులను మోడీ సర్కార్ అందజేసి ఉంది.