- ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు మాత్రమే లబ్ధి
- కేంద్ర నిర్ణయం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది
- హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : జమిలి ఎన్నికలతో దేశం సర్వనాశనం అవుతుందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీని వలన మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికలపై స్పందించారు. బీజేపీ మాత్రమే ఈ జమిలి ఎన్నికలను దేశంలో సమర్ధిస్తుందని అన్నారు.
కేంద్ర నిర్ణయం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తాను వ్యతిరేకిస్తున్నానని, దీనితో కొత్త సమస్యలు కొనితెచ్చుకోవడం అవుతుందని. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాని కూడా ప్రచారం చేయాల్సిన అవసరం మోడీ, అమిత్ షాలకు ఉందని, ఈ నేపథ్యంలో ఎన్నికలు వాళ్లిద్దరికీ ఆ అవసరం ఉన్నంతమాత్రాన మనకు జమిలి లేదని ఒవైసీ పేర్కొన్నారు. విడతలవారీగా నిర్వహించే ఎన్నికల ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.