ఖైరతాబాద్ మహాగణపతి 11 రోజులపాటు ఘనంగా పూజలు చేశారు.. గంగమ్మ చెంతకు చేరుకున్నారు. గణపతి బప్పా మోరియా అంటూ వేలాది మంది భక్తుల నినాదాల మధ్య సప్తముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ విగ్రహం.. ఈసారి ఏడు ముఖాలతో దర్శనమిచ్చారు. 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కమిటీ. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగానే మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని..గంగమ్మ ఒడికి చేర్చారు. కాసేపటి క్రితమే నిమజ్జనం కూడా పూర్తయింది.
వేలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ రోడ్లు కిక్కిరసాయి. ఈరోజు రాత్రిలోగా ట్విన్ సిటీస్‌లోని గణపయ్యలను హుస్సేన్ సాగర్‌లో పూర్తి చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిమజ్జనంగా స్వయంగా వీక్షించారు. ఏర్పాట్లు అన్నీ స్వయంగా పరిశీలించారు. పోలీసులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనాన్ని స్వయంగా తిలకించారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ నిమజ్జనం జరిగింది. భక్తులు బై బై గణపయ్య.. వెళ్లి రావయ్య అంటూ కేరింతలు కొట్టారు.