- హెల్త్ కార్డులు కూడా
- అర్హతను ఖరారు చేసేందుకు త్వరలోనే మరో భేటీ
- రేషన్ కార్డుల అర్హతపై రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం
- 16 మంది ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకున్నాం
- కెబినెట్ సబ్ కమిటీ భేటీలో చైర్మన్ ఉత్తమ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :గడిచిన పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెలలో ఆ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది పక్రియ మార్గదర్శకాల ఖరారు ఈ నెలాఖరులోగా పూర్తి నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై సోమవారం హైదరాబాద్ లోని జలసౌధలో మంత్రివర్గ ఉపసంఘం 4వ భేటీలో కెబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు, హెల్త్ కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు.
ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 2,81,70,000 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న దానిపై తాము చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే లేఖలు రాశామని చెప్పారు. త్వరలోనే మరోసాటి భేటీ అయి తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనే విషయంపై ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి.
ఇప్పటి వరకు 16 మంది ప్రజాప్రనిధులు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారన్న పొంగులేటి.. ఆ సహేతుకమైన సూచనలు, సలహాలపై కూడా ఈ భేటీలో చర్చిస్తామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇచ్చే సూచనల విషయంలో తాము ఎలాంటి భేషజాలకు పోకుండా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పొంగులేటి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త సంచాలకులు ప్రియాంక ఆల,ఇతర అధికారులు