Home తెలంగాణ మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఐదు మార్గాల్లో 78.6 కి.మీ. ప్రతిపాదన
  • సాయంత్రంలోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పణ
  • కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్ర ఆమోదానికి
  • మొదటి దశలో మూడు కారిడార్లకు కొనసాగింపుగా
  • రెండో ఫేజ్‌లో రూ.24,042 కోట్లతో 60కి పైగా స్టేషన్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ రైలు మార్గం పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఐదు మార్గాల్లో కలిపి 78.6 కి.మీ.ల మేర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు గతంలోనే జరగగా తాజాగా 60కి పైగా స్టేషన్ల కోసం రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ఈ మార్గాలపై సీఎం.. అధికారులకు పలుమార్లు సూచనలు చేశారు. సీఎం ఆదేశాలు, సూచనలతో రెండో దశ డీపీఆర్‌లు రెండుగా రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ రెండు డీపీఆర్‌లో సీఎం సూచించిన కొత్త మార్గాలను అధికారులు పరిగణలోకి తీసుకుని అంచనాలు రూపొందించారు.

రెండో దశలో మూడు దశల వారీగా మొదటి దశలో కారిడార్లకు కొనసాగింపుగా ఉంది. తాజాగా సిద్ధమైన రెండు డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశాలు ఉన్నాయి. మంత్రిమండలిలో ఆమోదం తెలిపి, వాటిని కేంద్రం అనుమతి కోసం పంపించనున్నారు. కాగా మహానగరానికి ఓఆర్ఆర్ తర్వాత మణిహారం లాంటి మెట్రో రైలు పనుల్లో వేగం పుంజుకోవడంతో నగరంలో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూపొందించిన డీపీఆర్ల ప్రకారం.. కారిడార్-3కి కొనసాగింపుగా మెట్రోను నాగోల్ నుంచి ఎల్బీనగర్, మైలార్‌దేవుపల్లి, జల్‌పల్లి, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 ప్రాంతంలో పొడిగిస్తారు. ఈ మార్గంలో 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ కారిడార్‌నే మైలార్‌దేవుపల్లి నుంచి ఆరాంఘర్, రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ సమీపంలో నిర్మించే కొత్త హైకోర్టు వరకు పొడిగించనున్నారు. మూడు స్టేషన్లతో దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉండనుంది.

అలాగే ఈ కారిడార్-3కి మరో వైపు రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్ రాంగూడ, విప్రో సర్కిల్,ఫైనాన్షియల్ డిస్ట్రిక్, యూఎస్ కాన్సులెట్ మీదుగా కోకాపేట నియో పోలీసులుగా 11.3 వరకు విస్తరించడానికి డీపీఆర్‌ను సిద్ధం చేశారు. అలాగే కారిడార్-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని పొడిగిస్తారు.మరోవైపు కారిడార్-1కి రెండోవైపు పొడిగింపుగా మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు పొడిగించి, చందానగర్ ప్రాంతంలో కొంతదూరం రెండు డెక్కీని ప్రతిపాదించగా, ఈ మార్గంలో 10 స్టేషన్లు రానున్నాయి. కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. పొడిగిస్తారు. ఆరు స్టేషన్లు రానున్నాయి. ఇదీలావుంటే… కేంద్రానికి రెండోదశ డీపీఆర్‌లు త్వరగా చేరాలంటే ఫ్యూచర్ సిటీని మినహాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ ఐదు కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో డీపీఆర్ ను కూడా కలిపి పంపాలని కేంద్రం కోరితే మెట్రో విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈరెండు కలిపితే 110కి అవుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech