- మన దేశ సంస్కృతి ఎంతో గొప్పది
- భిన్నత్వంలో ఏకత్వం భారత సంస్కృతి లక్ష్యం
- అన్ని పండుగలు సామూహికంగా నిర్వహిస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో : మన దేశ సంస్కృతి ఎంతో గొప్పదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం నాడు ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకున్న హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆనందం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్ ను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. బడా గణేష్ ను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రమంతా కదిలివచ్చినట్లుగా ఉందని, ఇసుకేస్తే రాలనంత జనాన్ని చూస్తున్నామని అన్నారు. 70 అడుగులు ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీని అభినందిస్తున్నాని అన్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిసిన సంస్కృతి అని, అవసరమొచ్చినప్పుడు అందరూ కలిసి సామూహికంగా పండుగలు నిర్వహిస్తామని అన్నారు.
భవిష్యత్ లో ఇదే సంస్కృతిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి అంటే డెవోషన్ మాత్రమే కాదని, ఎమోషన్ కూడా చూసిన. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బాల గంగాధర్ తిలక్ పిలుపుతో దేశవ్యాప్తంగా గల్లీ గల్లీకి గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తున్నామని, రాబోయో రోజుల్లో కూడా కొనసాగిద్దామని ఆయన అన్నారు. మొన్నటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో బీభత్సం జరిగింది, బాధితుల కష్టాలు తొలగిపోవాలని బడా గణేష్ ను ప్రార్ధించినట్లు హరీష్ రావు చెప్పారు. తొమ్మిదెండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో నిమజ్జనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీష్ రావు తెలిపారు.