- ఎజెండాలో కీలక అంశాలు
- వరదలపై కేంద్ర సాయం కోసం తీర్మానం
- బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ
- రెండొందల పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌కు సన్నాహాలు
- చర్చకు రానున్న రుణమాఫీ, రైతు భరోసా
- హైడ్రాకు విశేష అధికారాలపై ఆసక్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సంభవించిన ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి, సహాయం కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర కేబినెట్ కోరుతోంది. మొదట్లో రూ. 5వేల పైచిలుకు కోట్ల ప్రాథమిక అంచనా వేసిన సర్కార్ తాజాగా రూ.9వేల కోట్ల నష్టం నిర్ధారణ తుది నివేదికను సిద్ధం చేసింది.
ఈ ఇప్పటికే రాష్ట్రంలో నిలిచిన కేంద్ర బృందానికి వరద నివేదికను అందజేసింది. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రాంతాలు, రంగాల వారిగా జరిగిన నష్టం, నిర్వాసితుల దుస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో తీవ్ర వరదనష్టం ఏర్పడింది. తాము చూసింది కేంద్రానికి నివేదిక రూపంలో వివరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ అత్యధిక నిధులు రాబట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రమంత్రులకు విజ్ఞప్తులపై కెబినెట్‌లో చర్చించడం విశ్వసనీయంగా తెలిసింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన విధానాలను ఖరారు చేయడం కేబినెట్ యోచిస్తోంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనతో కేబినెట్ నిర్ణయం ఉండబోతున్నట్లు.
రేషన్ కార్డులు పొందే అర్హతలపై సవరణలు చేసి, ప్రజలకు మరింత సౌలభ్యంగా అందజేయాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. హెల్త్ కార్డుల విషయంలో కూడా మంత్రి మండలి చర్చించినట్లు సమాచారం. ఈ కీలక సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవల పంపిణీని సులభతరం కోసం ఆరోగ్య కార్డుల పంపిణీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే హైడ్రాకు చట్టబద్ధతను తీసుకురావడానికి ఆర్డినెన్స్ ఇచ్చే విషయాలను కేబినెట్ చర్చించనుంది. ప్రస్తుత 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోన్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ అందించిన రేవంత్ సర్కార్ కోరుతోంది. ఇక రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కేబినెట్‌లో చర్చిస్తుందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. దీని అమలుకు సంబంధించి కెబినెట్‌లో రోడ్ మ్యాప్ ఖరారు చేయాల్సిన భేటీ సమాచారం. అలాగే, విద్యా రంగంలో సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యా కమీషన్, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు కమీషన్‌లపై కేబినెట్‌లో చర్చలు జరుగుతున్నాయని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.