Home తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లపై పర్కారుకు ఊరట – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

విద్యుత్ కొనుగోళ్లపై పర్కారుకు ఊరట – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
విద్యుత్ కొనుగోళ్లపై పర్కారుకు ఊరట - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • తెలంగాణ బకాయిలపై నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఫిర్యాదు
  • విద్యుత్ కొనుగోళ్ల బిడ్లో పాల్గొనకుండా అడ్డుకున్న డిస్పాచ్ సెంటర్
  • హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్
  • విద్యుత్ కొనుగోళ్ల బిడ్‌లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలంటూ కోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లు, అమ్మకాలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వంపై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్ కొనుగోలు, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనేలా అనుమతించేలా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాను హైకోర్టు అమ్మింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది. దీంతో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ కు భారీ ఊరట లభించినట్లే. విద్యుత్ కొనుగోళ్ల బకాయిల చెల్లింపులపై గత కొంత కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే రూ.261కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో ఫిర్యాదు చేయడంతో విద్యుత్ కొనుగోళ్ల బిడ్‌లో పాల్గొనకుండా ఆ విభాగం అడ్డుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెలితే.. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను డిస్కంలు ప్రతిరోజూ ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు చేస్తున్నారు. అయితే గురువారం రాష్ట్ర డిస్కంలు బిడ్లలో పాల్గొనలేకపోయాయి.

విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ.261 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని తక్షణమే చెల్లించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఛత్తీస్ గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలు విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్ విచారించారు. 2వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని అయితే ప్రస్తుతం వేయి మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే కొనుగోలు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు అనుమతినిచ్చింది. కొనుగోలు చేసినా చేయకపోయినా రూ.261కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మెలికపెట్టిందని దీన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లామని అడ్వకేట్ జనరల్ వాదించారు.

మధ్యంతర ఉత్తర్వులు జారీ

ప్రస్తుత సీఐఆర్‌సీలో కేసు నడుస్తోందని అయినా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి విద్యుత్ ఎక్స్ఛేంజీలలో లావాదేవీలు నిర్వహించకుండా అడ్డుకుందని ఏజీ కోర్టుకు వివరించారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగిన విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని ఫిబ్రవరిలో సూచించామని అయినా చెల్లించడానికి ముందుకు రాలేదని ఛత్తీస్ గఢ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై స్టే విధిస్తూ విద్యుత్ ఎక్స్ఛేంజ్ కొనుగోలు, అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech