టాలీవుడ్ సీనియర్ నటి హేమకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రేవ్ పార్టీ వ్యవహారం ఆమె మెడకు ఉచ్చులా బిగుసుకుపోతుంది. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ నమోదు చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం 9మంది రేవ్ పార్టీని నిర్వహించారని తెలిపారు. హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. హేమ ఎండీఏ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జతపరిచారు. హేమ ఫ్రెండ్ వాసు ఆమెను ఈ పార్టీకి పిలిచినట్లు పోలీసులు నిర్ధారించారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో పాటు.. 9మంది పేర్లను ఛార్జ్ షీట్‌లో పోలీసులు చేర్చారు.
బెంగళూరులో కొన్ని నెలల కిందట రేప్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాసు అనే వ్యక్తి బర్త్ డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే చాలా ప్రముఖులు ఈ పార్టీలో ఉన్నారు. నటి హేమ కూడా ఇదే పార్టీకే. మొదట తాను బెంగళూరులో లేనని, హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. కానీ ఆ వీడియోనే పోలీసులకు ఓ సాక్ష్యంగా మారిన కథనాలు కూడా వచ్చాయి. ఈ డ్రగ్స్ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.