Home తెలంగాణ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే
  • దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
  • ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదరం
  • ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరిక
  • పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా?
  • ఎటు పోతోంది మన రాష్ట్రం?
  • ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది.
  • కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేస్తారా?
  • ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?
  • ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్న కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారంటూ ఆగ్రహం

ముద్ర, తెలంగాణ బ్యూరో :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడి చేయడాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నించారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్.

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు ఇచ్చిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డి ని గృహ నిర్భంధంలో ఉంచిన గాంధీ…అరికెపూడి గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని కేటీఆర్ ప్రశ్నించారు. వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కా ముందస్తుగా ప్లాన్ చేసి ఈ దాడి చేశారని కేటీఆర్ అన్నారు. పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. చిల్లర చేష్టలకు ఇలాంటి చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చూస్తుంటే జాలేస్తోందన్నారు.

అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని ప్రయత్నించే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వమే దాడి చేయడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చాలు ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా రాసి పెట్టుకుంటామని. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech