టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానాన్ని కలిసి తనకు పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనంతరం ఈ నెల 15వ తేదీన నిర్వహించే తన పదవీ బాధ్యతల స్వీకారానికి రావాలని వారిని ఆహ్వానించారు. ఈ పర్యటనలో మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలను కలిసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గీయుల సమాచారం.
కాగా, టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైన ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌ను మంగళవారం వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు. వారిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విజయరమణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.అలాగే, 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఏఐసీసీతో జరిపిన చర్చలకు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ ఉద్యోగాల భర్తీ, పీసీసీ కార్యవర్గ సభ్యుల ఎంపిక వంటి విషయాలపై ఏఐసీసీ అగ్రనేతలు,రాష్ట్ర నేతలతో ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది.