35
ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ పూర్తయింది. ఖైరతాబాద్ గణనాధుడి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు. రేవంత్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్.
ఇవాళ ఉదయమే ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. గత ఏడాది 63 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు.