- సీపీతో వైరం లేదు కానీ సీఐలకు ఎందుకు పోస్టింగ్ ఇస్తలేవు
- కౌశిక్ రెడ్డి నోరు జాగ్రత్త
- రసమయి 10 ఎకరాల భూమి కబ్జా చేసింది నిజం కాదా
- ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :పోలీసుశాఖలో పోస్టింగ్ ల పేరుతో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించగలిగితే రాజకీయాలను నుంచి వైదొలుగుతానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల సీఐ పోస్టింగ్ కోసం తాను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా రుజువు చేయాలని డాక్టర్ కవ్వంపల్లి డిమాండ్ చేశారు. నిరూపించలేకుంటే ఇక ముందు తప్పుడు ఆరోపణలు చేయకుండా నోరుమూసుకొని ఉండాలని, లేకుంటే తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. ఓటమిని జీర్ణించుకోలేని బాలకిషన్ బట్టకాల్చి మీదేసే విధంగా తనపై ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
సెక్రటేరియట్‌కు వెళ్లేది నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించుకోవడానికే తప్ప బాలకిషన్‌తోపాటు డబ్బుల కోసం పైరవీలు చేయడం.. వరదల సమయంలో తాను గ్రామాల్లోనే ఉంటున్నానని, తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే మత్స్యకారుడు వాగులో కొట్టుకుపోయిన ప్రదేశాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించి గాలింపు చర్యలు ముమ్మరం చేశానని, రాష్ట్ర బీసీ సంక్షేమం,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో వరద తాకిడికి గురైన గ్రామాలను సందర్శించారు. ఇవాళ మృతుడు లక్ష్మయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసినట్టు ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. వరదల వేళ తాను హైదరాబాద్ కే పరిమితమైనట్టుగా రసమయి సాగించిన ప్రచారంలో వాస్తవం ఉంది.
సీపీతో వైరం లేదు
కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో తనకు ఎలాంటి వైరం లేదని, సీపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, మంచి చేస్తే సమర్థిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు.కమిషనరేట్ పరిధిలో దళిత సీఐ పోస్టింగ్ ల విషయంలో సీపీ వైఖరిని తప్పుపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన నలుగురు సీఐలను జాయిన్ కాకుండా సీపీ వెనక్కి పంపారు. సీఐలు కిరణ్, రవి కుమార్, రమేష్, సదన్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారేనని, తమ జాతి బిడ్డలపై జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పాల్సి వచ్చింది. దళిత సీఐలు కష్టపడి పోస్టింగ్ లు తెచ్చుకుంటే సీపీ తిప్పి పంపడం, ఐజీ ఉత్తర్వులు సైతం ధిక్కరించి సీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ముఖ్యమంత్రి, డీజీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రసమయి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని సీఐగా నియమించుకోగా, ఇప్పుడు తాను దళిత సామాజికవర్గానికి చెందిన సీఐలు ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పోస్టింగుల కోసం లెటర్లు ఇచ్చి డబ్బులు తీసుకునే వారని, కాంగ్రెస్ పాలనలో మాత్రం ఆ సంస్కృతికి చరమగీతం పాడామన్నారు.
నోరు తెరిస్తే బాగుండదు కౌశిక్
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కల్లుతాగిన కోతిల చిందులకు హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.ఈ వ్యవహారానికి ఫోన్ ట్యాంపింగ్ ను ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని తెలిపారు. నోరు తెరిస్తే బాగుండదని ఆయన కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. మీ చరిత్రలు తెలియందెవరికి అని ఆయన ప్రశ్నించారు. ఎస్ ఐలు, సీఐల దగ్గర పండుగలు, పబ్బాల పేరుతో పొట్టేళ్ల తెప్పించుకొని దావతులు చేసుకొనే కౌశిక్, రసమయిలు సుద్ద పూసలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
అక్రమ కేసులు లేవు…
బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు, బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన పాల్జేసేవారని డాక్టర్ కవ్వంపల్లి యాజమాన్యం.మానకొండూర్ నియోజవర్గంలో అనేక మందిపై ఈ తరహా కేసులు నమోదు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదు, అలాగే అక్రమ కేసులు నమోదు చేయడం. గులాబీ నేతలు, కార్యకర్తలపై ఏమైన కేసులు నమోదై ఉంటే అవి వారు చేసిన తప్పుడు పనులు వల్ల నమోదైనవే తప్ప బనాయిచ్చిన తప్పుడు కేసులు ఎంతమాత్రం కావని ఆయన స్పష్టం చేశారు.