రాష్ట్రంలోని విద్యాసంస్థల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం జారీ చేసింది. ఇక కరెంట్ బిల్లుల ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లించనుంది.
ఉపాధ్యాయ దినోత్సవం వేళ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రకటించారు. ఈ మేరకు గురువారం విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఉచితంగా విద్యుత్తును అందజేసినట్లు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పై కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుంది
విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుంది. pic.twitter.com/hvpAt2QVTo
— భట్టి విక్రమార్క మల్లు (@Bhatti_Mallu) సెప్టెంబర్ 5, 2024