మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం ప్రాంత సమీపంలో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్నతోపాటు అదే దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.
రఘునాథపాలెం ఏరియాలో ఈ దళం కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మావోయిస్టులకు వరుసగా కోలుకోని దెబ్బలు తగులుతున్నాయి. రెండురోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించిన విషయం తెల్సిందే.