23
ముద్ర, తెలంగాణ బ్యూరో : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది. బుధవారం మధ్యాహ్నం 12.58 గంటలకు 43 అడుగులు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 43.30 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి అంచనాలను గమనిస్తూ ముంపు ప్రాంత వాసుల తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.