బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ రెండు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం తనవంతుగా సహాయం చేస్తున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ కూడా భారీగా విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల బీభత్సం తనను ఎంతోగానో కలిచివేసిందని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతో కొంత కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నానని ఆయన చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల చర్యలకు…
— జూనియర్ ఎన్టీఆర్ (@tarak9999) సెప్టెంబర్ 3, 2024