భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను సంస్థ ఇచ్చేందుకు స్వయంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జైంట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ విలచ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఆయన అన్నారు.
వరద బాధితులకు సహాయంగా సుమారు రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు
రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఉద్యోగుల జైంట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి. pic.twitter.com/cwtlECa1j5
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) సెప్టెంబర్ 3, 2024