20
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమీషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కమీషన్ ప్రధాన కర్తవ్యం. ఇందులో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు బృందంగా కలిసి పనిచేయనున్నారు.
కాగా విద్యా కమీషన్ చైర్మన్, సభ్యులను త్వరలోనే ప్రభుత్వం నియమించింది. గతంలోనే అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో గతంలో భేటీ అయిన సంగతి తెలిసిందే.