భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మూడు రోజులుగా కుండపోత వర్షాలతో భారీ వరద చేరుకుని ఖమ్మంలోని అన్ని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు వాగుకు పోటెత్తిన వరదతో ఖమ్మం పట్టణ ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు.
ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిగాయపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు మంత్రి పొంగులేటి ఇచ్చారు. వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా…. కొద్ది దూరం వెళ్లాక మంత్రి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడ్డారు. దీంతో కాలుకు దెబ్బ తగలడంతో వెంటనే సహాయకులు స్పందించి ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.ఇంటికి తీసుకుని వెళ్లగా… వైద్యులు వెంటనే పరిశీలించి కాలికి పట్టి కట్టారు.