- ఎక్కడికక్కడే నిలిచిన రైళ్లు
- ప్రయాణికుల ఇబ్బందులు
కేసముద్రం, ముద్ర: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల వాగులు, ఏర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. కేసముద్రం – నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య పెద్దమోరి వరదకు కొట్టుకుపోయి రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకు పోయింది. దీనితో కాజీపేట – విజయవాడ రైల్వే సెక్షన్‌లో రైళ్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేసముద్రం రైల్వే స్టేషన్ లో బెంగుళూర్ – దానాపూర్, దానాపూర్ – బెంగుళూర్ సంఘ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపివేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వరద నీటితో కేసముద్రం తాళ్లపూసపల్లి వద్ద రైల్వే ట్రాక్‌కుపోవడంతో కేసముద్రం రైల్వేస్టేషన్‌లో రైలు నిలిచిపోయి పాసెంజర్లు ఇబ్బంది పడకుండా ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కట్ ప్యాకెట్స్ అందించిన రూరల్ సీఐ సరవయ్య, కేసముద్రం.ఐ మురళీధర్ సిబ్బంది.