Home తెలంగాణ క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నిందితుల్లో ప్రభుత్వోద్యోగులు
  • ఎస్పీ జానకీ షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్ :పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుందని, కొత్త సభ్యులను చేర్పిస్తే వర్కింగ్ బోనస్ లభిస్తుందని నమ్మిస్తూ అమాయకులను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి మోసగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల వారు తెలిపారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎక్సైజ్ అధికారి, ఎఆర్ కానిస్టేబుల్ వివరించారు. కడెం మండలం నవాబుపేట్‌కు చెందిన సల్ల రాజ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు అమాయకులైన వారిని క్రిప్టో కరెన్సీలో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసగించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా లో కడెం నుండి ఈ వ్యవహారంతో అన్ని జిల్లాల, ప్రాంతాల ప్రజల మోసాలు చేయడమే వీరి పని అని అన్నారు. పలువురి ఫిర్యాదు మేరకు ప్రధాన వ్యక్తి సల్ల రాజ్ కుమార్ ను పట్టుకుని విచారించిన నేరం జరిగిన క్రమాన్ని వివరించాడు.

ఆయనతో చేతులు కలిపిన సాయికిరణ్, నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్ కు చెందిన కండెల నరేష్ (ఉపాధ్యాయుడు), గంగాధర్(ఎక్సైజ్ ఎస్ ఐ), ఎఆర్ కానిస్టేబుల్ మహేష్ లను పట్టుకుని విచారణ చేపట్టారు. సల్లా రాజ్ కుమార్ చెప్పిన వివరాల యూనిట్ కాయిన్,యు బిట్ అనే ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే డాలర్ రూపంలో లాభం వస్తుందని నమ్మబలికారు. కేవలం ఒకటిన్నర ఏళ్లలో పెట్టుబడిని 5 నుంచి పది రెట్లు పెంచుకోవచ్చని నమ్మించారు. నాన్ వర్కింగ్ బోనస్ గా రోజుకు 0.5 శాతం, చేరిస్తే 1 శాతం బోనస్ వస్తుందని ఆశపెట్టారని పేర్కొన్నారు.

పలువురి ని మభ్యపెట్టి ఈ వ్యవహారంలో చాలా మంది ఉద్యోగస్తులను చిన్న, మధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టి నెలకి కొంత మొత్తాన్ని వారికి చెల్లిస్తూ అందించారని తెలిపారు. అయితే ఈ వ్యాపారంలో ప్రారంభంలో చేరిన వారు మాత్రమే ప్రయోజనం పొందుతారని అన్నారు. ఇది పూర్తిగా గొలుసుకట్టు విధానంలో కొనసాగుతుందని చెప్పారు. వీరిలో సల్ల రాజ్ కుమార్ మెటా మాస్క్ లో అకౌంట్ సృష్టించాడని, ఆ తర్వాత యు బిట్ క్రిప్టోలో అకౌంట్ తెరిచాడనీ వివరించారు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించాడు. నిర్మల్ జిల్లాలో Ubit అనే కరెన్సీ నెట్‌వర్క్‌తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ అని తెలిపాడనీ సూచించింది. ఇతను కిరణ్, సాయికృష్ణ తో పాటు నరేష్, మహేష్, గంగాధర్ లతో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు.

ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్పీ అవినాష్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి కుమార్‌తోపాటు నిర్మల్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, నిర్మల్ రూరల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సైలు సాయి కృష్ణ, ఎం రవి, రవీందర్, కానిస్టేబుల్ గణేష్, తిరుపతి షోకత్, సతీష్‌లను అభినందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech