34
ముద్ర ప్రతినిధి, నిర్మల్: అభిమానానికి హద్దులుండవన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అభిమానిస్తే దేనికైనా సిద్ధపడతారన్న సూచన రుజువు చేశారు భైంసా మండలం వాలెగాం వాసి ఎస్ గంగాప్రసాద్. మంగళవారం రోజు ముధోల్ ఎంఎల్ఏ రామారావు పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనను కలిసి అభినందించారు. అయితే భైంసా మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్ గంగా ప్రసాద్ తన రక్తంతో ఎంఎల్ఏ చిత్రపటాన్ని వేయించి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి చిత్రం గీసేందుకు అవసరమైన 105 మి. లీ రక్తాన్ని తీయించి పెయింటర్ కు అందజేశాడు. ఆయన గీశాక ఆ తన అభిమాన నాయకునికి అందజేశాడు.