28
ముద్ర, శేరిలింగంపల్లి:ఆగస్ట్ 24 న ఆర్జి కార్ గవర్న’ రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన విషాద సంఘటనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మణికొండ యాంకో హిల్స్ వాసులు పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు వారు సమావేశమై బాధిత డాక్టర్ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కోల్కతాలోని మెడికల్ కాలేజీ యాజమాన్యం మహిళల భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఇలాంటి హేయమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ల్యాంకో హిల్స్ వాసులు సూచించారు.చట్టాన్ని అమలు చేసే అధికారులు సత్వర చర్యలు చేపట్టారు.