19
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఈ ప్రచారంలో నిజం లేనప్పటికీ ప్రజల్లో పార్టీపై అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మే 4న కొత్తగూడెం సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను బీజేపీ ఎత్తివేస్తోందన్న రేవంత్ వ్యాఖ్యలపై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పరువు నష్టం కేసు పెట్టినట్లు వివరించారు.