Home తెలంగాణ సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు కార్పొరేషన్ పదవి దక్కనుందా ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు కార్పొరేషన్ పదవి దక్కనుందా ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు కార్పొరేషన్ పదవి దక్కనుందా ? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలను పలుమార్లు కలిసిన చెవిటి వెంకన్న యాదవ్
  • చెవిటికి పదవి దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణుల ఆశాభావం
  • కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా అంచలంచెలుగా ఎదిగిన చెవిటి.

తుంగతుర్తి ముద్ర :- కొద్ది రోజుల్లో ఏఐసీసీ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు రానున్న స్థానాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామంలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండుసార్లు పదవి చేపట్టి అంచలంచలుగా ఎదిగిన బీసీ సామాజిక వర్గ నేత చెవిటి వెంకన్న యాదవ్ పేరు ప్రధానంగా వినబడుతుంది .కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నాడు కమ్యూనిస్టులతో ,తెలుగుదేశం పార్టీతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నుండి తప్పించుకుని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహరహం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్ననలు పొందింది .

అందులో భాగంగానే రెండుసార్లు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా అధిష్టానం ఆశీస్సులతో పదవి లభించింది. మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా తుంగతుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమిపాలైనప్పటికీ కార్యకర్తలధైర్యం పడకుండా వారికి అండగా ఉంటూ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ క్యాడర్ చెక్కుచెదరకుండా చూడడంలో తన వంతు పాత్ర పోషించారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతాయి. కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి కొరకు జరిగిన పోరాటంలో సుమారు రెండున్నర దశాబ్దాల కాలం అనేక పోలీసు కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడంలో తన వంతు పాత్ర పోషించిన వెంకన్న అధిష్టానం దృష్టిలో కాంగ్రెస్ పార్టీ సుశిక్షితుడైన కార్యకర్తగా నాయకుడిగా గుర్తింపు పొందినట్లు విశ్వసనీయంగా గుర్తింపు పొందింది .

అందుకేగాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రెండుసార్లు వెంకన్న యాదవ్ కి అధిష్టానం కట్టబెట్టింది.సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాన్ని శాసించే స్థాయి గల సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారందరితో కలిసి ఉంటూ వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీని ముందుకు నడిపిస్తూ నమోదులో కూడా అగ్రగామిగా నిలిచే విధంగా కృషిచేసి ఆయా సీనియర్ నేతలు అందరినీ ఆహ్వానించారు. ఒక పదవి వెంకన్న యాదవ్ కు తప్పక స్థానం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గ నేతగా యాదవ సామాజిక వర్గంలో అత్యంత పట్టున్న నాయకునిగా చెవిటి వెంకన్న యాదవ్ గుర్తించబడటం. గత పార్లమెంట్ భువనగిరి కోసం ఆశించిన నేపద్యంలో రానున్న కాలంలో మంచి భవిష్యత్తు కావాలని అధిష్టానం ఇచ్చిన మాటకు కట్టుబడి నాటి శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో తనవంతు పాత్రను పోషించారు .అత్యధిక మెజార్టీ కోసం తీవ్రంగా కృషి చేశారు .

చేర్చుకున్న సీనియర్ నాయకులతో పాటు రాష్ట్రంలోని సీనియర్ నాయకులతో, మంత్రులతో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులతో సత్సంబంధాలు కలిగి ఉండటం చెవిటి వెంకన్న యాదవ్ కు కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేయనున్న కాంగ్రెస్ పదవుల్లో చెవిటి వెంకన్న యాదవ్ పేరు ఇప్పటినుంచి శ్రేణులు ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు .కారెస్ శ్రేణుల ఉత్సాహాన్ని గమనించి చెవిటి వెంకన్న యాదవ్ కు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇవ్వడంలో ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి…..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech