ముద్ర, సినిమా ప్రతినిధి భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశం నలుమూలా అన్ని భాషల్లో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, ఆయా చిత్రాలకు పనిచేసిన వివిధ సాంకేతిక నిపుణుల పేర్లను ఎంపిక చేస్తూ కేంద్రం ఈ జాబితాను జ్యూరి ఎంపిక చేస్తుంది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. వివిధ కేటగిరిలలో తెలుగు సినిమాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది. 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడు కేటగిరిలో మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రమ్, విక్రాంత్ మాసే బరిలో నిలువగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును రిషబ్ శెట్టి సొంతం చేసుకున్నాడు. ఇక ఉత్తమ నటి అవార్డును ‘తిరుచిత్రంబలం’ సినిమాకు గానూ నిత్యమీనన్ , ‘కచ్ ఎక్స్‌ప్రెస్’ మానసి పరేఖ్ ఇద్దరు పంచుకున్నారు. 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు సినిమాగా ‘కార్తికేయ-2’ ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్‌మోహర్’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్2’, ఉత్తమ తమిళ సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు తెలుగువాడైన జానీ మాస్టర్‌కు దక్కింది. ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ సినిమాలో మేఘం కరిగిందే పాటకు గానూ జానీ మాస్టర్ గెలుచుకున్నాడు.
‘కార్తికేయ2 చిత్రం నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్”అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
కాంతార స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘కాంతార’… ఘనతను అందుకున్న ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను రిషబ్‌శెట్టి కలవడమే. తాజాగా ఈ కాంతార హీరో సోషల్‌మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
దక్షిణాది పరిశ్రమ నుంచి కాన్సెప్ట్ ఆధారంగా సినిమాలు చేసే ఒకే ఒక్క పరిశ్రమ మలయాళ ఇండస్ట్రీ. ప్రయోగాలు అక్క డ కొత్త కాదు. నిరంతరం ప్రయోగాత్మక చిత్రాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం అలాంటి ప్రయోగాత్మ క చిత్రాలలో నటించడానికి ఎంతో ఇష్ట పడతారు. కథ నచ్చితే పాత్రతో సంబంధం లేకుండా పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే మలయాళ పరిశ్రమ అవార్డుల పరిశ్రమగా పేరు గాంచింది. ఏటా విడుదల చేసే జాతీయ అవార్డుల్లో అగ్ర స్థానం వాళ్లదే అనడంలో అతి శయోక్తి లేదు. కథలో సందేశం..పాత్రలో వాస్తవికత..ప్రతీది మిగతా పరిశ్రమల నుంచి మలయాళ ఇండస్ట్రీని వేరు చేస్తోంది. తాజాగా 70వ జాతీయ అవార్డు వేడుకల్లో ఆట్టం ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది.
బాక్స్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు.. “ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న కార్తికేయ 2 బృందానికి మరియు దర్శకుడు చందూ మొండేటికి నా అభినందనలు. అలాగే, దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డు గ్రహీతలకు మంచి గుర్తింపు లభించినందుకు నా హృదయపూర్వక అభినందనలు” అని చెప్పుకొచ్చాడు.
ఇక కెజిఎఫ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కుడోస్ ప్రశాంత్ నీల్ మరియు యష్.. ఉత్తమ కన్నడ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు కెజిఎఫ్2 యొక్క మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను” అని తెలిపాడు. ఇక ఈ సినిమాలతో పాటు కాంతార చిత్ర బృందానికి కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపాడు. “రిషబ్ శెట్టి.. ఉత్తమ నటుడిగా మీరు అర్హులు. మీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ ఇస్తోంది. అలాగే, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నందుకు కాంతారావు టీమ్ మొత్తానికి అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.
70వ జాతీయ అవార్డుల విజేతలు వీరే:
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి(కాంతార)
ఉత్తమ నటి: నిత్యమీనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ చిత్రం: అట్టం(మలయాళం)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: కాంతార(కన్నడ)
ఉత్తమ దర్శకుడు: సూరజ్ ఆర్. బర్జాత్య(ఉంఛాయ్)
ఉత్తమ బాల నటుడు: శ్రీపత్(మాలికప్పురం)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా(ఉంఛాయ్)
ఉత్తమ సహాయ నటుడు: పవన్ రాజ్ మల్హోత్రా(ఫౌజా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ యాకర్షి(అట్టం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్, ఫౌజా (హరియాన్వీ)
ప్రకటనలు
ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్(అట్టం)
ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బు&అరివుమణి(కేజీఎఫ్2)
ఉత్తమ సంగీతం(నేపథ్య): ఏఆర్ రెహమాన్(పొన్నియన్ సెల్వన్-1)
ఉత్తమ సంగీతం: ప్రీతమ్(బ్రహ్మస్త్ర)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్(పొన్నియన్ సెల్వన్-1)
ఉత్తమ కొరియోగ్రఫీ: జానీ మాస్టర్(తిరుచ్చిత్రంబలం)
ఉత్తమ గీత రచన: నౌషద్ సర్దార్ ఖాన్((ఫౌజా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్(కేసరియా-బ్రహ్మస్త్ర)
ఉత్తమ నేపథ్య గాయని: బాంబే జయశ్రీ(సౌది వెళ్లక్క)
*ఉత్తమ కాస్ట్యూమ్స్:*నికి జోషి(కచ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): ఆనంద్ కృష్ణమూర్తి(పొన్నియన్ సెల్వన్)
స్పెషల్ మెన్షన్: గుల్‌మోహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్‌పాయ్; కదికన్ (మలయాళం), సంగీత