- వంద శాతం రుణమాఫీ ప్రకటించిన ఒక్క రైతు తాను రాజకీయాలను వదిలిస్తా….
- దమ్ముంటే తన సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరించాలి
- ఇంత దిగజారుడు సీఎంను ఎక్కడ చూడలేదన్న ఆగ్రహం
- రైతులను మోసం చేసినందుకు ఆయనపై ఛీటింగ్ కేసు పెట్టాలి
- రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు
- రుణమాఫీ మొత్తం చేసి ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు
- కాంగ్రెస్ పాలన చారాణా కోడికి బరాణా మసాలాలా ఉంది
- పాత గోడకు కొత్త సున్నం వేసి బిల్డప్ అప్ ఇవ్వడం తప్ప ఏమీలేదు
- బీఆర్ఎస్ హయంలో రైతులకు రూ. లక్ష కోట్లు ఇస్తే… కాంగ్రెస్ కేవలం రూ. 17 వేల కోట్లే ఇచ్చింది
- మరోసారి రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ పచ్చి మోసం….దగా! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ ఏ ఒక్క రైతు చెప్పినా….తాను రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. తన ఛాలెంజ్ ను స్వీకరించే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తన జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి దిగిజారుడు సీఎంను చూడటం.
రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసినందుకు ఆయనపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండగడ ఇంకా. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం మాఫీ చేశామని చెబితే అది దిగజారలేదని. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలని హితవు పలికారు. అడ్డమైన ఆంక్షలు, అర్థంలేని షరతులతో.. అన్నదాతలను నిండా ముంచారని ధ్వజమెత్తారు.రేవంత్ మోసాలు చూసి.. గిన్నిస్ రికార్డ్స్ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారని సెటైర్లు వేశారు.
శుక్రవారం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరోసారి తనదైన శైలిలో రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చెబుతోంది ఈ రుణమాఫీ.. దేశంలోనే రైతులకు జరిగిన అతిపెద్ద మోసమన్నారు.అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగనుంది. రెండు లక్షల రుణమాఫీ కోసం రూ.40వేల కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారు. మరి బడ్జెట్ లో రూ. 26 వేల కోట్లు పెట్టి… కేబినెట్ సమావేశంలో మాత్రం రూ. 31 వేల కోట్లుగా సీఎంఓ ట్వీట్ చేసి ఉన్నారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఎన్నికల ముందు చెప్పి…ఇప్పుడు కొర్రీలు పెడుతుండం సిగ్గుచేటని.
రుణమాఫీలో చాలా మందికి నిబంధనల పేరుతో కటింగ్ లు పెట్టబడ్డాయి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు….కటింగ్ మాస్టర్ అన్నట్లుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 60 శాతం మంది రైతులకు ఎగ్గొట్టి….. రుణమాఫీ చేశామని చెప్పడం కాంగ్రెస్‌జారుడు రాజకీయాలను నిదర్శనమన్నారు.మార్పు, మార్పు అంటూ రైతన్నలను మోసం చేశాడని. మొత్తంగా రుణమాఫీయే అతి పెద్ద మోసమన్నారు.
2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ. 2500, జాబ్ క్యాలెండర్, ఆటో అన్నలకు సాయం మోసం, వృద్ధులకు రూ. 4 వేలు మోసమేనని వాస్తవం.అన్ని వర్గాలకు మోసం చేయడమన్నదే ప్రభుత్వ పాలసీగా మారింది.బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు, రుణమాఫీ కోసం దాదాపు రూ. లక్ష కోట్లు ఇచ్చామన్నారు. మొదటి దఫాలో ఒకే సారి 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ చేశామని కేటీఆర్ చెప్పారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తే.. 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ అయ్యిందని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి కూడా 17,934 కోట్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఈ ఒక్క లెక్కతో కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎన్ని లక్షల మందిని ముంచారో అర్థమవుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు రుణమాఫీ చేసి, రైతుబంధు కూడా ఇచ్చామన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలైలో రైతుబంధు పడేదని.. ఇవాళ రైతుబంధు పడిందా? అని అడిగారు. రైతుబంధు ఇచ్చే సూచన కూడా కనిపించడం లేదని అన్నారు. పైగా చరణ కోడిన బారాన మసాలాట్లు….ప్రచారం చేసుకుంటారని. ఆయన పాలన పాత గోడకు కొత్త సున్నం వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కార్ వంద శాతం రుణమాఫీ చేసి ఉంటే రాహుల్ గాంధీ సభకు ఎందుకు రాలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఆయనకు డౌట్ ఉంది కాబట్టే….సభకు రాకుండా తప్పించుకున్నాడని పేర్కొన్నారు. దీనికే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా ఎంఎల్ ఏ పదవికి రాజీనామా చేయాలంటూ రంకెలు వేస్తున్నాడన్నాడు. రేవంత్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండగడుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ ఎటు పోదు….. అలాంటి ఆశలు కాంగ్రెస్ నాయకులు పెట్టుకోవాలన్నారు.
ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం చేస్తాం
ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం చేయడానికి వచ్చేనెలలో తనతోపాటు పలువురు పార్టీల నేతలంతా కలిసి వెళ్లేందుకు కేటీఆర్ వెళ్లారు.