- కవితకు బెయిల్… ఆ తర్వాత రాజ్యసభ
- హరీశ్ రావుకు అసెంబ్లీ ప్రతిపక్ష నేత పోస్టు
- త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం
- ఇరు పార్టీల మద్య రహస్య ఒప్పందం
- త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు
- ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం సంచలన వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోన్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గవర్నర్ పోస్టు వరిస్తుందని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రమంత్రి అవుతారని, హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా ఉంటారని. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందనీ తర్వాత ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆయా పార్టీల మద్య అంతర్గత, రహస్య ఒప్పందాలు జరిగేవి. బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగకమానదని సీఎం చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తర్వాత చోటుచేసుకునే పరిణామాలను వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలనూ వివరించిన సీఎం.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు త్వరలోనే హైదరాబాద్ కు రానున్నారని తెలిపారు. అలాగే రైతు రుణమాఫీకి రూ. 5వేల కోట్ల నిధులు రిజర్వ్‌లో ఉంచామన్నారు. ఇప్పటికీ రుణమాఫీ కానీ రైతులు ఎవరైనా ఉంటే తమ కలెక్టరేట్ జిల్లాకు ఫిర్యాదు చేయవచ్చు. ఒకే కుటుంబంలో వారికి రూ. 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‌గా పరిగణించండి. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్క్ ఉండాలంటే ఆగస్టు 15 వరకు రుణమాఫీని ప్రకటించినట్లు సీఎం వివరించారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదనీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు ఇవ్వాలి. అలాగే తన తమ్ముళ్ల మీద అంత ఏడుపు ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన తమ్ముళ్లకి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని.. ఎవరు ప్రభుత్వ ప్రోటోకాల్ వాడుకోవడం లేదని చెప్పారు. తన తమ్ముడు కొండల్ రెడ్డి తన సొంత డబ్బులతో విదేశాలకు వెళ్తే కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారనీ తాను సీఎం అయ్యానని వాళ్లంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటారా అని ప్రశ్నించారు. వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన రాజకీయం ఏదైనా సీఎం చెప్పుకొచ్చారు.