30
ముద్ర, తెలంగాణ బ్యురో : ఆనాడు విశాల భారత దేశం రెండు ముక్కలవడం దురదృష్టకరమని, ప్రధాని పదవికోసం పోటీ పడిన నెహ్రు, జిన్నా వలనే దేశం విడిపోయిందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఆనాడు విచ్ఛిన్నం చేసిన శక్తులే నేడు మళ్ళీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. దేశాన్ని ఉత్తర, దేశాలుగా విచ్ఛిన్నం చేసేందుకు ఆహ్వానం పలికారు.
ఈ సవాళ్లను ఎదుర్కునేందుకు యువత సిద్ధం కావాలని ఆయన కోసం. పంద్రాగస్టు సందర్భంగా గురువారం నాడు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పింగళి వెంకయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ ఓబీసీ మోర్చా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు.