25
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పూసుగూడెం పంప్ హౌస్‌ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా చూపిస్తున్నారు. అనంతరం అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భద్రాద్రి జిల్లాలకలపల్లి మండలం కమలపల్లిలో ఉన్న మూడో పంప్ హౌస్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి శ్రీకారం చుట్టారు. సీతారామ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 9.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించనున్నారు.