Home తెలంగాణ మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • స్వాతంత్రం పొందటమే కాదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఎందరో మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాలు, పట్టుదల ఫలితంగా ఈ రోజు మనం స్వాతంత్ర్యంగా జీవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత స్వాతంత్ర పోరాటం కుల, మత, వర్గాలన్నిటికీ అతీతంగా జాతి యావత్తును ఒక్క తాటిపై నిలిపింది. మనను బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసారు.

వారి పోరా టం కారణంగానే మనమంతా స్వపరిపాలనతో ఆత్మగౌరవంగా జీవిస్తున్నామన్నారు. అలుపెరగని పోరాటంతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వాన్ని అందించిన మహానీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటాన్ని, త్యాగాలను పట్టుదలను స్మరించుకుంటూ జాతి ఆశలను కొనసాగించాలని. స్వాతంత్ర్యం పొందటమే కాదు… దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది.భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech