27
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్ చేసింది. కాంగ్రెస్ సర్కార్ అభ్యర్ధన మేరకు వారిని తెలంగాణకు విడుదల చేస్తూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపుతున్నట్లు వివరించారు.
కాగా ఇందులో 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారిలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు నుంచి అంగీకారం గుర్తించింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగుల తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.