29
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. జైంట్ కలెక్టర్ వీ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ వై.మదన్ మోహన్ రెడ్డిని లంచం వ్యవహారంలో వల పన్ని, అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ఉన్నారు.
ధరణి పోర్టల్‌లోని నిషేధిత భూముల జాబితా నుంచి 14 కుంటల భూమిని తొలగించేందుకు వారు రూ.8 లక్షల లంచం తీసుకున్నప్పటికీ… ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి జైంట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరూ పట్టుబడకుండా లంచం తీసుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ వారి ఎత్తుగడలను తాము చిత్తు చేశామని ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ చెప్పారు.