ముద్రణ న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ స్టేట్ కోర్డినేటర్ గా రంగారెడ్డి మణికొండ మున్సిపాలిటీకి చెందిన వాసిరెడ్డి నరేష్ నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియామకానికి సంబంధించి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ్ రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోసం నరేష్ విస్తృతంగా పనిచేస్తున్నారు. ఎటువంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేనప్పటికీ తను నమ్మిన ప్రజాస్వామ్యం, సెలరిజం సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న వాసిరెడ్డి నరేష్ తపనను గుర్తించి ఆయన సేవను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని భావించామని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందనడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వాసిరెడ్డి నరేష్
ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్ తన నమ్మకం మీద నమ్మకంతో ఈ అవకాశం కలిపిన సామ రామ్మోహన్ రెడ్డికి, ఏఐసీసీ పెద్దలకు, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి, టీపీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్య మంత్రి శ్రీ భట్టి విక్రమార్కకు, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జెట్టి కుసుమ కుమార్ కు ధన్యవాదాలు వరకు.