29
ముద్ర ప్రతినిధి, నిర్మల్: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, ఊచకోతలను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు స్వచ్ఛందంగా తమ సంస్థలను మూసి ఉంచారు.
విద్యాసంస్థలు, కళాశాలలు మూసి వేశారు. హోటళ్ళు, సినిమా థియేటర్లు కూడా మూసి ఉంచారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సర్వీసులైన బ్యాంకులు, ఆసుపత్రులు, బస్సులు మాత్రమే నడిచాయి. బంగ్లాదేశ్ ఘటనల గురించి ప్రసారమాధ్యమాల్లో చూసిన నేపథ్యంలో బంద్కు సంపూర్ణ మద్దతు లభించింది.