Home తెలంగాణ కేటీఆర్ కు జైలు ఖాయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కేటీఆర్ కు జైలు ఖాయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కేటీఆర్ కు జైలు ఖాయం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఆ నమ్మకం నాకుంది
  • బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ
  • ఆ పార్టీతో బీజేపీ జత కట్టిందన్న ప్రచారంలో నిజం లేదు
  • వక్ఫ్ భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలే కబ్జా చేశారు
  • కేంద్రమంత్రి బండి సంజయ్

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ ను జైలుకు పంపుతారనే నమ్మకం తనకుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మాజీమంత్రి కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు అన్నారు. తనతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి జైలుకు పంపిన తీరు ఎవరూ మర్చిపోలేదు. శనివారం బీజేపీ రాష్ట్ర తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ మాట్లాడారు.

రేవంత్ పై నమ్మకం పోతే జరిగేది యుద్ధమే..

సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్ లో జరగబోయేది యుద్ధమేనని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీతో బీజేపీ జత కడుతుందనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వస్తే .. ఆ అంశంతో బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా ? అని ఆయన నిలదీశారు. కోర్టు విషయాలను బీజేపీతో ముడిపెట్టి మాట్లాడటం పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఎస్‌లకు నేటికీ పోస్టింగ్ నిజాయితీ ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందని. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ..

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని బండి స్పష్టం చేశారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక నిధులివ్వడం లేదు. కేంద్ర నిధులతో పంచాయతీ నడుస్తున్నది. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీశ్‌రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు బాధ్యత కాంగ్రెస్ నేతకు అప్పగించింది. తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని అన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి సహాయం.

వాస్తవాలన్నీ త్వరలో బయటకు వస్తాయి..

కాంగ్రెస్‌కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని.. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై అంచనా. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్న మాట వాస్తవం కదా అని మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయం? అని ఆయన నిలదీశారు. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయని, పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటపెడతానని బండి సంజయ్ అన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే, వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech