31
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో మరో నాలుగు గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. జిల్లాలోని కుబీర్ మండలం రంజని తండా, కడెం మండలంలో కొత్త ధర్మాజీ పేట్, తానూరు మండలంలో కల్యాణి, ఖానాపూర్ మండలంలో రంగపేట పంచాయితీలు కొత్తగా ఏర్పాటు చేశారు. దీనితో జిల్లాలో గ్రామ పంచాయితీల సంఖ్య నాలుగు వందలు.