- పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది..
- పదిహేను రోజుల క్రీతం ఘటన మరవకముందే మరో ఘటన..
ముద్ర, కోరుట్ల: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న అనిరుధ్ మృతి చెందాడు. పదిహేను రోజుల క్రీతం జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన జరిగింది. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందన్న విషయం అర్థం కావడం లేదు. పదిహేను రోజుల క్రితమే ఘటన జరిగి ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఆరవ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులకు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగించింది. తెల్లవారు జామున మూడు గంటలకు ఓ విద్యార్థి జగిత్యాల జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. మరో విద్యార్థుల్లో ఒకరిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించిన మరో విద్యార్థికి స్థానిక మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతి చెందిన విద్యార్థి సిరిసిల్ల మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన అనిరుధ్. ఇంకొకరు మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్‌ను మెట్పల్లి హాస్పిటల్ చికిత్స అందించారు. మరో విద్యార్థి మెట్పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన మోక్షిత్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.