Home జాతీయ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. సీబీఐ సహా ఈడీ కేసులోనూ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం బెయిల్‌నిచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీడ్ ట్రయల్‌కి ఆయనకు హక్కు ఉందని తేల్చి చెప్పింది. “దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. స్పీడీ ట్రయల్‌కి వెళ్లే హక్కు ఆయనకు ఉంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఆయనకు ఈ హక్కు కల్పించాల్సింది” అని న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.

బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండీషన్లు పెట్టింది. సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని తేల్చి చెప్పింది. పాస్‌పోర్ట్ సరెండర్ చేసింది. అంతకు ముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన వాదనను పట్టించుకోవాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్‌కి ఇదే కేసులో బెయిల్ లభించింది. ఆ తరవాత సిసోడియాకు బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కీ బెయిల్ వచ్చినప్పటికీ అది కేవలం ఈడీ కేసులో పరిమితమైంది. సీబీఐ కేసులో మాత్రం ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు.



You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech