34
- ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఘటన
ఇబ్రహీంపట్నం :- వీధి కుక్కలు చిన్న పిల్లలను కరిచి చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఉడుగుల కీయాన్ష్ గౌడ్(4) గత 20 రోజుల క్రితం పాఠశాలలు వెళ్లి తిరిగివస్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి మొఖంతో పాటు శరీర భాగాలపై తీవ్రంగా గాయపరిచాయి.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి వచ్చారు. మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌కు చికిత్సగా అక్కడ 20 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా మారిందని, గ్రామస్తులపై, చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.