Home అంతర్ జాతీయ బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. ముందుగా తాత్కాలిక పరిపాలన ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికల మార్గం సుగమం చేశారు. యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు.

చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా సేవలందించి, బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.

పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్‌లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరునూ వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉంటే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు యూనస్పై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలుశిక్ష పడింది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని
సాధించింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech