28
ముద్ర, తెలంగాణ బ్యూరో : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి. బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ నేతలు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. అనంతరం గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా విస్మరించిందని. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు.