Home తెలంగాణ హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్
  • దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు
  • అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం

ముద్ర, తెలంగాణ బ్యూరో:-ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు పని కల్పించే కొత్త సెంటర్ నెలకొల్పినట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. గత ఏడాది బృందం ముఖ్యమంత్రి దావోస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది.

టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కొత్త సెంటర్‌కు మెరుగైన నెలకొల్పే కొత్త సెంటర్ అందుబాటులోకి వస్తుంది. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

ఐటి రంగానికి అన్ని విధాలుగా సహకరిస్తాం..

ఐటి రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, కొత్త కేంద్రాన్ని స్థాపించాలంటే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
అభిప్రాయపడ్డారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech