Home తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ప్రొఫెసర్ జయశంకర్ సార్ అడుగు జాడల్లోనే రాష్ట్ర సాధన - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • నాటి ఉద్యమంతో పాటు స్వరాష్ట్ర ప్రగతిలో వారందించిన స్ఫూర్తిని కొనసాగించాం
  • సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు మనం అందించే ఘన నివాళి – కేసీఆర్
  • ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్న బీఆర్ఎస్ అధినేత


ముద్ర,తెలంగాణ బ్యూరో:-తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని, వారు తెలంగాణ కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.తొలిదశ నుంచి మలి దశ ఉద్యమం వరకు తెలంగాణ సాధన వారు చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో ఆయన అందించిన అచంచల పోరాట స్ఫూర్తి అజరామరమైనదని కేసీఆర్ కొనియాడారు.

ఆయన అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి వరకు శాంతియుత పద్దతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించారు. అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర సాధన అనంతరం ప్రజలతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే కొనసాగించాలని కోరారు. ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలోనూ., తదనంతరం పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ ఆయన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ అన్నారు.

స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకలజనులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన బిఆర్ఎస్ పాలన అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘన నివాళి అని కేసిఆర్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech