28
- తిరుమలలో సిఫార్సు లేఖలు చెల్లవంటూ స్పష్టం చేసిన టీటీడీ
ముద్ర, తెలంగాణ, బ్యూరో : ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విషయంపై స్పష్టత వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీసుకొచ్చే లేఖలను అనుమతించబోమని టీటీడీ ఈఓ శ్యామల రావు తేల్చి చెప్పారు. టీటీడీ నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్యామల రావు అడిగిన పలు ప్రశ్నలకు భక్తులు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్బంగా తిరుమల దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల పరిశీలన లేఖలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన టీటీడీ ఈఓ శ్యామల రావు శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన పరిశీలన లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి సిఫార్సు లేఖలు తీసుకుంటే అవి చెల్లుబాటు కావని తేల్చేశారు.